Chess Master HariKrishna | సీఎంను కలిసిన ఛెస్ మాస్టర్ హరిక్రిష్ణ..
భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ పెంటాల హరికృష్ణ తల్లిదండ్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. 2024 ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ FIDE 45 వ చెస్ ఒలంపియాడ్‌లో స్వర్ణ పథకంతో పాటు చైనా హెంగ్జ్యూ లో 2022 లో జరిగిన ఏసియన్ గేమ్స్‌లో సాధించిన సిల్వర్ మెడల్‌ను చూపించగా.. సీఎం రేవంత్‌రెడ్డి హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ , తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఉన్నారు.
Leave A Comment